పిన్నలైనా ,పెద్దలైనా ఎవరిని తొలిసారిగా కలిసినా వారిని ఆదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా సంభాషించి..." మేము ఎప్పుడూ టి.వి.లో చూసే ప్రముఖ గాయని ఈవిడేనా ? !!! " ఒక పద్మశ్రీ స్థాయి వ్యక్తికి , ఎదుటివారిలోని బెరుకు ను పోగొట్టేలాగా సామాన్యులతో ఇంత కలిసిపోయి ఉండగలగడం సాధ్యమేనా ??? !!!" అని అనుకోగలిగేట్లు చెస్తారంటే ఆ వ్యక్తి ఎంతటి నిగర్వి , నిరాడంబరి అయ్యి ఉండాలి ??
ఒక జగత్ప్రసిధ్ధ గాయనీమణి " మీ గురువు గారు నేను తన అభిమాన గాయకిని అని చెప్తారు కానీ మొట్టమొదటిసారిగా నాకు ఆన్నమయ్య కీర్తన నేర్పించి నాతో సినిమా లో పాడించింది మీ గురువు గారే " అని మా గురువు గారి గురించి చెప్తారంటే ,.... ఎందరొ సంగీత దర్శకులు, గాయకులు " మీ సంగీతం మాకు స్పూర్తిదాయకం , మీ గానం అద్భుతం అని పాదాభివందనాలు చెస్తున్నారంటే ఆ వ్యక్తి లో ఎంతటి సంగీత ప్రతిభ నిబిడీకృతమై ఉండాలి???
ఎంతో ప్రతిభ కలిగిన రచయితలూ, ఆధ్యాత్మికవేత్తలూ ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్పృహ కు ముగ్ధులై , " అన్నమయ్య కీర్తనలకు ఎంతోమంది ఎన్నో రకాలుగా భాష్యం చెప్తారు కానీ మీరు చెప్పే భాష్యం ఎక్కువ కన్విన్సింగ్ గా ఉంటుంది " అని ప్రముఖ వేదికలపై చెప్తూ చేతులెత్తి నమస్కరిస్తున్నారంటే ..... ఆ వ్యక్తి లో ఎంతటి ఆధ్యాత్మిక సంపద నిక్షిప్తమై ఉండాలి???
ఎంతోమందికి ప్రేరణగానూ , లక్ష్యం గానూ కనిపించే సినిమా రంగం నుండి ఎన్నో అవకాశాలు వచ్చినా ....... బాహ్యాడంబరాలకు అవలీలగా గురి చేసే యుక్త వయస్సు నుండీ .... ఆర్ధికావసరాలకు తలవంచక తప్పని నడి వయస్సు వరకూ... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తలవొగ్గక , "భగవత్సంబంధిత గానానికే నా గాత్రం అంకితం " అని నిలబడి విజయ సాధించారంటే ఆ భక్తురాలి భక్తి లో ఎంతటి నిబధ్ధత , అంకితభావం ఉండాలి ???
లక్ష్య దిశగా తన ప్రయాణం లో ఎన్నోసార్లు కుల- లింగ వివక్షతలను ఎదుర్కొన్నా .... ఎన్నో కుట్రలకూ , కుతంత్రాలకూ గురి అవ్వవలసి వచ్చినా.... అదే పంథాలో శత్రువులను ఎదుర్కోగలిగిన అవకాశం, బలిమీ తనకూ ఉన్నా .... ఎన్నడూ ఆ వక్ర మార్గాన్ని ఎంచుకోక, తాను నమ్మిన అన్నమాచార్యుడు బోధించిన " బ్రహ్మమొక్కటే " అన్న సూత్రాన్ని మాత్రమే ఆచరించి లక్ష్యాన్ని సాధించి చూపారంటే ... ఆ వ్యక్తికి తాను నమ్మిన మార్గంపట్ల ఎంతటి నమ్మకం , నిజాయితీ ఉండాలి??
తాను నమ్మిన , తన జీవితాన్ని అంకితం చేసిన భగవన్మందిరానికే తనని దూరం చేసిన పరిస్థితులు వచ్చినా,.... నిరాశ, నిస్పృహ లకు లోనుకాక మ్రొక్కవోని ధైర్యంతో ..,తన హృదయాలయం లో వెలసిన స్వామిని తనతోనే తెచ్చుకొని ... తాను ఉన్నచోటే తన స్వామిని ప్రతిష్టించి చూపించారంటే..... ఆ భక్తురాలికి భగవంతునితోనూ.. ఆ స్వామికి ఈ భక్తురాలితోను ఎంతటి అవినాభావ సంబంధం ఉండి ఉండాలి???
సినిమాలలోనూ ప్రముఖ వేదికలపైనా పాడగలిగే స్థాయి నుండి ఇంట్లో పాడుకోగలిగే స్థాయి లో మాత్రమే ప్రతిభకలిగిన వివిధ స్థాయి లకు చెందిన శిష్యులు ఉన్నా ,...... అందరినీ సమానం గా ప్రేమిస్తూ , ఎవరికి కావలసిన చెయూత వారికి అందిస్తూ .... ఎవరి ఆ స్థాయి లో ఉంటే తానూ ఆ స్థాయి లో ఒదిగిపోయి.. అందరికీ మాడం " నా స్వంతం " ఆన్న భావన కలుగచేయగలుగుతున్నారంటే ఆ గురువుకు తన ప్రతి ఒక్క శిష్యుల మీద ఎంతటి సమభావం, సహృద్భావం ఉండాలి???
అల్లరి పాటలను, సినిమా పాటలను ఎక్కువగా ఆస్వాదించే విద్యార్ధులకు ఆ పాటల ద్వారా కూడా భగవంతుని దర్శించటం అలవరచి, అలవోకగా ఆధ్యాత్మికత వైపు నడిపేస్తారంటే.. ఆ గురువుకి శిష్యుల పట్ల ఎంత సహనం, నేర్పు, ఉండాలి ???
తనకోసం ఏనాడూ ఎవరినీ ఏమీ అభ్యర్ధించవలసిన అవసరం రాని వ్యక్తి, "ప్రతిభ కలిగిన తన శిష్యులకు అవకాశం కల్పించాలి" అని మాత్రం సభాముఖం గా ప్రముఖులకు విగ్న్యప్తి చేస్తున్నారంటే..... ఆ గురువుకు తన శిష్యులపై ఎంతటి మమకారం, మాతృ ప్రేమ నిండి ఉండాలి ???
ఒక అతిసామాన్య, అత్యంత అల్ప సంగీత గ్న్యానం ఉన్న విద్యార్ధి " నేనొక కీర్తనను ట్యూన్ చేసాను మాడం " అని వాట్సాప్ లో పాడి పంపిస్తే.... ఆ కీర్తనను ఓపికగా విని విశ్లేషించటమేగాక ..ఆ బాణీ ని సరిదిద్ది మెరుగులు అద్దటం కోసం సుదూరంలో ఉన్న ఆ విద్యార్ధి కోసం తన అమూల్య సమయం నుండి 2 గంటలు వెచ్చించి ,స్కైప్ ద్వారా మరీ ఒక్కొక్క లైన్ నూ సరిదిద్ది ప్రొత్సహిస్తారంటే ..... అస్సలు ఆ గురువు శిష్యులకు అందించే ప్రొత్సాహాన్ని ఏ మాటలలో వర్ణించాలి???
ఎంతో దృఢ పోరాట పటిమ కలిగిన వ్యక్తిగా తన సమస్యలతో పోరాడుతూ, తన బాధ్యతలతో సతమతమౌతున్నా.. సాటిమనిషికి చిన్న బాధ కలిగినా కదిలిపోయి, వారి సమస్యని తన సమస్యగా భావిస్తూ... వారికి మార్గ నిర్దేశకత్వం చేస్తూ,.. తన శక్తికి మించిన ఆర్ధిక సహాయాలు చేస్తూ.. ,తన శారీరిక శ్రమని లెక్క చెయ్యక వారి కొరకు ధ్యానాదికాలు చేస్తూ. సమయాభావానికీ ఖర్చుకీ వెనకాడక ప్రతిఫలమాశించని సంకీర్తనౌషధాలు అందిస్తూ... ఎవరికి కష్టం వచ్చినా ..కొండంత అండగా నిలుస్తూ .... తన గురించి కూడా ఏనాడూ ఏమీ అడుగని తాను, తనను నమ్మిన వారికోసం మాత్రం అహర్నిశలూ స్వామిని అర్ధిస్తూ... ఆయననుండి ఆర్తులకు అన్నీ సాధించిపెడతారంటే ... ఆ మహా మనీషి సున్నిత మనస్సులో ఎంతటి మానవీయత నిండి ఉండాలి ???
మా చెల్లెలు కొడుకుకి ప్రమాదం జరిగింది మాడం , భయం గా ఉంది " అని ఒక శిష్యురాలు రాత్రి 11 గంటలకి ఫోన్ చేస్తే.... " నువ్వు భయపడకు, నేను స్వామిని వేడుకుంటాను " అని మాడం చెప్పాక ... చమత్కారం జరిగినట్లు , డాక్టర్లు ఊహించినదానికి విరుధ్ధంగా ఆ పసివాడికి పెను ప్రమాదం తప్పిందని తెలిసాక.... " ఇప్పుడు రాత్రి ఒంటిగంట దాటింది.. ఈ విషయం చెప్పటం కోసం ఫొన్ చేసి మాడం కి నిద్రాభంగం కల్గించటం సరికాదు..రేప్రొద్దున ఫొన్ చేసి థాంక్స్ చెప్పాలి" అనుకుంటుండగా మాడం తనంతట తానే ఫొన్ చేసి , " ఇప్పటి వరకూ ఆ పిల్లవాడి కోసం ధ్యానం చేసాను.., ఇప్పుడు ఎలా ఉంది ఆ పిల్లవాడికి అని అడిగారంటే..... అసలు..ఇలాంటి మహోన్నత వ్యక్తుల మహనీయత్వాన్ని వర్ణించటానికి .ఏ భాష వాడాలి ? ఏ భావాన్ని పొదగాలి??
తనకున్న వేలాదిమంది శిష్యులూ, అభిమానులనూ, వారి వారి కుటుంబ సభ్యులనూ.. వారి పేర్లనూ, అతి చిన్న చిన్న వివరాలనూ తన కంప్యుటర్ లాంటి గ్న్యాపకశక్తితో గుర్తుంచుకొని ఆశ్చర్యపరచే వ్యక్తి.... తనను వంచించినవారి వంచనాగుణాన్నీ.., వారు చేసిన మోసాలనూ తప్పులను మాత్రం మరచిపోయినట్లుగా ప్రవర్తిస్తూ... కోరితే మరల మరల వారిని చేరదీస్తూ.., నిరంతరం వారి మంచినే కాంక్షిస్తారంటే... ఆ అమాయక హృదయానికి ఎంతటి క్షమాగుణం ఉండాలి???
ఎంతో అసామాన్య ప్రతిభ, స్థాయి, కీర్తిప్రతిష్టలు, అవార్డులు ఉన్న వ్యక్తి... ఎక్కడైనా ఏదైనా హాస్యభరిత సంఘఠన ఎదురైతే మాత్రం... అన్నీ మర్చిపోయి పసిపిల్లలలాగ నిండారా నవ్వుతూ.. అందరినీ నవ్విస్తారంటే.. ఆ మనస్సు ఎంత నిష్కల్మషం గా...నిర్మలం గా ఉండాలి???
ఎన్నో వేల మంది శిష్యులకు తాను గురువైనా... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనుండి తనకు ఎన్నో ఉన్నత పురస్కారాలు లభించినా... తన గురువుల ముందు పెద్దల ముందు అతి సామాన్య వ్యక్తి లాగా వినయం గా మ్రోకరిల్లుతూ.. తన గురువుల ఆరాధనోత్సవాలు, జన్మదినోత్సవాలు నిర్వహిస్తున్నారంటే ఆ మహోన్నత శిష్యురాలికి ఎంతటి గురుభక్తి ఉండాలి?
ఇంటి బయట ఇన్నేసి విజయ నికేతనాలు ఎగురవేసినా... రచ్చ గెలిచినట్లుగానే... ఇంటిలోనూ గెలిచి చూపిస్తూ... తల్లిదండ్రులను వారు జీవించి ఉన్నంతకాలం కంటికి రెప్పలా చూసుకుని ,కీర్తిశేషులయ్యాక కూడా వారిని భక్తి గా ఆరాధిస్తూ...,కుటుంబ సభ్యులందరికీ , బంధువులకీ, ఏ మాత్రం లోటు రాకుండా ప్రేమని అందిస్తూ.., అందరికీ తలలో నాలికలా వ్యవహరించాలంటే ఆ వ్యక్తి ఎంతటి ప్రేమైక మూర్తి అయ్యి ఉండాలి???
క్షణం తీరిక లేని షెడ్యూల్స్ , వేల మంది విద్యార్ధులు - వారి బాధ్యతలూ.., అబిమానులూ, తన భుజస్కంధాల పైన మోసి ముందుకు తీసుకు వెళ్ళాల్సిన సంస్థ నిర్వహణా భారం, కుటుంబ బాధ్యతలూ...ఇలా ఎన్నో అంశాలతో సతమతమౌతున్నా కూడా సమకాలీన ప్రపంచంలో జరిగే సామాజిక, రాజకీయ, క్రీడా, చలనచిత్ర అంశాలన్నిటికీ తగు రీతిలో స్పందిస్తూ.., వాటికి తన ఆధ్యాత్మిక ,మానవీయ కోణాలని జోడిస్తూ శిష్యులకూ , అనుయాయులకూ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మానవత్వపు విలువలనూ..., ఆధ్యాత్మికతనూ బొధిస్తున్నారంటే ....ఆ ఉన్నత వ్యక్తి కి ఎంతటి సామాజిక స్పృహ , ఆధునిక శాస్త్ర పరిగ్న్యానం కూడా ఉండి ఉండాలి ???
ఇంత మందికీ ఇన్ని రకాలుగా అనుబంధాన్నీ, ఆత్మీయతనూ పంచి ఇస్తున్నా... తన మనస్సులో మాత్రం చెరుగని భగవద్రూపాన్ని ప్రతిష్టించుకొని ,..... ఆయననే ధ్యానిస్తూ, .... ఆ స్వామినే కీర్తిస్తూ...., భగవద్భావనలతో నిరంతరం రమిస్తూ... భగవత్తత్వాన్ని నిరంతరం బోధిస్తూ... తానే కదిలే భగవద్రూపం గా భాసిస్తూ.. మమ్మల్నందరినీ భగవన్మార్గంలోకి చేయిపట్టి నడిపిస్తున్నారంటే... ఆ మానవ మూర్తి లొవె ఎంతటి దైవత్వం నిండి ఉండాలి ???
ఇన్ని విశేష గుణాలూ .... వివిధ వ్యక్తులలో పంచబడినవి కావు, అన్నీ మూర్తీభవించి మా గురువు గారి రూపం లో వెలిశాయి.. అసలు అటువంటి గురువు దర్శన భాగ్యం దొరకడమే అపూర్వం.. అలాంటిది .. ఆ గురువుకి శిష్యులవడానికి మాకున్న అర్హత ఏమిటో.... ఏ జన్మలో చేసుకున్న సుకృతఫలమో... మాకెవరికీ అర్ధం కాదు..
ఇవన్నీ నాకు తెలిసిన అతి కొద్ది విషయాలు...,
అయినా వ్రాసినక్రొద్దీ అనంతం గల స్ఫురిస్తున్నాయి.
ఒక మహా సముద్రం ఒడ్దున నిలబడి చూస్తే.. ఆ సముద్రాన్ని కొంతమేరకే చూడగలుగుతాము.
అంతమేరకే ఆ సముద్రపు లోతునీ , హొయలనీ , అలలనీ చూడగలుగుతాము..
ఆంతే... అలాగే..మా గురువనే మహా సాగరపు ఒడ్డున నిలబడ్డ అతి మామూలు శిష్య సైకతరేణువును నేను...
అంతమేరకే నా అనుభవం...
నిజానికి నా అనుభవాలన్నీ.. సముద్రపు ఒడ్దుకి వచ్చే చిన్న చిన్న అలలు, వాటి తో పాటు కొట్టుకువచ్చే గవ్వలలాంటివి.
కానీ నా ఉద్దెశ్యం ప్రకారం ఈ మహా మనీషి ఒక నడిచే గ్న్యాన సాగరం .
ఆ సముద్రపు లొతు అనూహ్యం .
ఆ సముద్రగర్భం లో ప్రేమ, అనురాగం, విగ్న్యానం, ఆధ్యాత్మికత, భక్తి వంటి అమూల్య రత్నాలు అనంతం.
సముద్రపు గర్భంలోకి వెళ్లినక్రొద్దీ ..రత్నాలు రాసులుగా లభించినట్లే... మా గురు జలధి లోపలికి వెల్లిన క్రొద్దీ మాకు ఎన్నెన్నో గ్న్యాన రత్నాలు లభిస్తాయి.
సాధారణం గా సముద్రం లొప్లికి లోతు గా వెళ్లాలంటే ..ఎంతో కష్టతరమైన శిక్స్షణ, , సాధన కావాలి .
కాని మన గురువు గారికి దగ్గరగా వెళ్లడం మాత్రం చాలా సులభం. దానికి ఒక్కటే మార్గం..
కాలుష్య రహిత సాధన.
సాటి మనుష్యులపైనా, సంగీతం లోనూ, సాహిత్యంలొనూ, భక్తిలోనూ... అన్ని రంగాలలోనూ...అన్ని దిశలలోనూ... భావకాలుష్య రహిత..సాధన..
అదే మనం మన అపార గురు కృపను పొందడానికి అవలంబించవలసిన సాధనా మార్గం.
అదే మన గురువు బొధించిన మంత్రం...
మనలోని భావకాలుష్యాన్ని పారద్రొలి, భక్తి సంగీతం ద్వారా సమాజానికి మార్గదర్శకులమై, మన గురువు గారి ఆశయ సాధనకి తోడ్పడటానికై ...,
ఈ అంకితభావదినోత్సవమ్నాడు ప్రతినపూనుతూ...
మన గురువు, మాతృమూర్తి, శ్రీమతి శోభారాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేద్దాం.